Telangana: రేపే సీఎంను క‌లుస్తా: జ‌గ్గారెడ్డి

jagga reddy seek kcr appointmment

  • అసెంబ్లీలో ఉద్యోగాల‌పై కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌
  • సీఎం ప్ర‌క‌ట‌న‌ను స్వాగతించిన జ‌గ్గారెడ్డి ‌
  • కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతానని ప్రకటన  

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోర‌తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. గురువారమే కేసీఆర్‌ను క‌లిసేందుకు య‌త్నిస్తాన‌ని జగ్గారెడ్డి చెప్పారు. ఇప్ప‌టికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హంతో ఉన్న జ‌గ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్‌ను కోర‌తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించ‌డంతో, మ‌రోమారు ఆయ‌న వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

బుధ‌వారం నాడు అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ఖాళీ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లుగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అసెంబ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నో ఉద్య‌మాలు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. 

ఆ డిమాండ్ మేర‌కు ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డుతున్నందున కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకే ఆయ‌న అపాయింట్‌మెంట్ కోర‌నున్న‌ట్లుగా జ‌గ్గారెడ్డి చెప్పారు. సొంత స్థ‌లం ఉండి ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునేవారికి రూ.3ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని కూడా జ‌గ్గారెడ్డి కీర్తించారు.

  • Loading...

More Telugu News