AryaVaishya JAC: రోశయ్యకు సంతాపం విషయంలో జగన్ కులం చూస్తున్నారు: ఆర్యవైశ్య జేఏసీ విమర్శలు

Arya Vaishya JAC leaders slams CM Jagan

  • ఏపీ అసెంబ్లీలో గౌతమ్ రెడ్డికి సంతాపం
  • రోశయ్యకు కూడా సంతాపం తెలపాలన్న ఆర్యవైశ్య నేతలు
  • జగన్ కు ఎందుకంత కక్ష అన్న నేతలు

ఏపీ సీఎం జగన్ పై ఆర్యవైశ్య జేఏసీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం తెలిపే అంశంలో సీఎం జగన్ కులం చూస్తున్నారని ఆరోపించారు. రోశయ్య మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నామని తెలిపారు. 

ఆర్యవైశ్య జేఏసీ నేతలు సత్యనారాయణ, బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ అసెంబ్లీలో మేకపాటి గౌతమ్ రెడ్డికి మాత్రమే సంతాపం ప్రకటించారని, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. రోశయ్య మరణించినప్పుడు కూడా సీఎం జగన్ నివాళులు అర్పించలేదని వారు ఆరోపించారు.  

రోశయ్య అంటే ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులు అంటే జగన్ కు చులకనభావం అని విమర్శించారు. జగన్ కు ఆర్యవైశ్యులు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అసెంబ్లీలో రోశయ్య సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News