Prabhas: ప్రభాస్ తో నాకు మాటలు లేకపోవడమేమిటి?: పూజ హెగ్డే

Radhe Shyam movie update

  • ప్రభాస్ గొప్ప మనసున్న మనిషి 
  • నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు 
  • ఆయన ఇంటి నుంచే భోజనం వచ్చేది 
  • ఆయనపై కోప్పడటం ఎవరివల్లా కాదన్న పూజ హెగ్డే  

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' రూపొందింది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. 

అయితే ఈ సినిమా షూటింగు సమయంలోనే ప్రభాస్ - పూజ హెగ్డే మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ఒక టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కలిసి పోజులు ఇవ్వడానికి కూడా ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకి సమాధానంగా పూజ హెగ్డే స్పందిస్తూ .. "ప్రభాస్ గొప్ప మనసున్న మనిషి .. షూటింగు సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. తన ఇంటి నుంచే ప్రతిరోజూ భోజనం తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? .. అదంతా పుకారే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు" అంటూ చెప్పుకొచ్చింది.

Prabhas
Pooja Hegde
Radhakrishna Kumar
Radhey Shyam Movie
  • Loading...

More Telugu News