Uttar Pradesh: న‌డ‌వ‌లేని భార్య‌ను రిక్షాలో కూర్చోబెట్టి, తోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన వృద్ధుడు.. వీడియో ఇదిగో

 Azamgarh An elderly person reaches polling booth by pulling a cart

  • యూపీలో చివరిదశ పోలింగ్ 
  • అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వృద్ధ దంప‌తులు
  • త‌న‌ భార్య అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతోంద‌న్న వృద్ధుడు

యూపీలో చివరిదశ పోలింగ్ కొన‌సాగుతోంది. 54 నియోజకవర్గాల్లో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 613 మంది అభ్య‌ర్థులు పోటీలో నిలిచారు. కాగా, ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి ఓ వృద్ధుడు త‌న భార్య‌ను రిక్షాలో తీసుకురావ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. 

అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి స్వ‌యంగా రిక్షాను తోసుకుంటూ అతను వ‌చ్చాడు. త‌న భార్య అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతోంద‌ని, త‌న‌కు కూడా వెన్నెముక స‌మ‌స్య ఉంద‌ని అతను చెప్పాడు. అయినా త‌న భార్య‌ను రిక్షాలో కూర్చోబెట్టి తీసుకొచ్చాన‌ని తెలిపాడు. ప్ర‌భుత్వం ఇస్తోన్న రూ.500-రూ.1,000 పెన్ష‌ను స‌రిపోవ‌ట్లేవదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

  • Loading...

More Telugu News