Russia: తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

russia attacks in ukrain

  • ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ వినతి మేరకు నిర్ణ‌యం 
  • ఉక్రెయిన్‌లోని విదేశీయుల‌ను త‌ర‌లించ‌డం కోసం ఏర్పాట్లు
  • రెడ్ క్రాస్ వాహ‌నాలు ఏర్పాటు చేసి త‌ర‌లింపు

ఉక్రెయిన్ పై దాడులు జ‌రుపుతోన్న ర‌ష్యా తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ వినతి మేరకు ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకుంది. రెడ్ క్రాస్ వాహ‌నాలు ఏర్పాటు చేసి ఉక్రెయిన్‌లోని విదేశీయుల‌ను త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. 

ఈ నేప‌థ్యంలో కారిడార్ ఏర్పాటు కోసం ర‌ష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన‌ట్లు ర‌ష్యా మీడియా తెలిపింది. మ‌రోవైపు, ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల ఆ రెండు దేశాలు రెండు ద‌శ‌ల్లో చర్చలు జరిపినప్ప‌టికీ విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. దీంతో నేడు మూడో విడత చర్చలు జ‌రుగుతున్నాయి.

  • Loading...

More Telugu News