Surya: చెవిటి .. మూగ పాత్రలో సూర్య మరో ప్రయోగం!

Surya in  Bala movie

  • సూర్య తాజా చిత్రంగా 'ఈటి'
  • ఈ నెల 10వ తేదీన విడుదల
  • బాలాతో కొత్త ప్రాజెక్టు 
  • కథానాయికగా జ్యోతిక

మొదటి నుంచి కూడా సూర్య కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. విభిన్నమైన కథలను .. పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'ఈటి' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఇక ఈ సినిమా తరువాత చేయడానికి వెట్రిమారన్ .. బాలా ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలను ఆయన ఒకే సమయంలో చేస్తూ వెళతాడు. బాలా అనగానే అది ప్రయోగాత్మక చిత్రమని చెప్పేయవచ్చు. అలాగే ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. 

ఒక పాత్రలో ఆయన చెవిటి - మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర సరసన కథానాయికగా జ్యోతిక కనిపించనుందని అంటున్నారు. గతంలో సూర్య ద్విపాత్రాభినయం చేసిన 'బ్రదర్స్' .. '24' .. 'సెవెంత్ సెన్స్' సినిమాలకి మంచి ఆదరణ లభించింది. ఈ సారి సూర్య చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందన్నది చూడాలి.

  • Loading...

More Telugu News