Telugudesam: టిడ్కో ఇళ్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలంటూ టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర

TDP MLA Nimmala Rama Naidu starts Cycle Yatra for tidco houses

  • టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు
  • లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్
  • పాలకొల్లు నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు నిన్న సైకిల్ యాత్ర ప్రారంభించారు. 

టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు, వారి సమస్యలను, ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించే ఉద్దేశంతోనే తాను ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్టు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News