America: భారత్‌పై ఆంక్షలు విధించే యోచనలో అమెరికా.. రష్యాతో ‘ఎస్-400’ క్షిపణి వ్యవస్థ కొనుగోలే కారణం?

America keen to impose Sanctions on india

  • ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానికి వరుసగా మూడోసారీ దూరంగా భారత్
  • భారత్ వైఖరిపై అమెరికా అసహనం
  • ఆంక్షల దిశగా యోచన.. త్వరలోనే బైడన్ నిర్ణయం?

భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్న వేళ.. ఇండియాకు షాకిచ్చే నిర్ణయం దిశగా అమెరికా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా వైఖరిపై భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తుండడం, ఆ దేశం నుంచి అత్యాధునిక ‘ఎస్-400’ క్షిపణి వ్యవస్థ కొనుగోలుపై ఒప్పందం చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా.. ఇప్పుడు భారత్‌పైనా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అమెరికా దౌత్య వర్గాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. 

అయితే, అమెరికాకు కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌పై ఆంక్షలు ఎంతవరకు సబబన్న విషయంలో మథనపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి భారత్ ఎలాంటి వైఖరి ప్రకటించకుండా తటస్థంగానే ఉంది. 

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో రష్యా దాడిని ఖండిస్తూ సర్వసభ్య ప్రతినిధి సభ ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ వరుసగా మూడోసారి కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై అమెరికా అసహనం వ్యక్తం చేస్తోంది. రష్యా దురాక్రమణపై స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News