KCR: మోదీ అడ్డాకు వెళ్తున్న కేసీఆర్.. భారీగా వెలిసిన ఫ్లెక్సీలు!

KCR Flexis in Varanasi

  • రేపు వారణాసికి వెళ్తున్న కేసీఆర్
  • బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం
  • దేశ్ కా నేత అంటూ ఫ్లెక్సీపై పేర్కొన్న వైనం

ప్రధాని మోదీ లోక్ సభ నియోజకవర్గం వారణాసి (ఉత్తరప్రదేశ్)లో తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. కేసీఆర్ రేపు వారణాసికి వెళ్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ సింగ్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, మాజీ ప్రధాని దేవేగౌడ, మంత్రి కేటీఆర్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరుల ఫొటోలు ఉన్నాయి. 'ఉత్తరప్రదేశ్ మీకు హార్థిక స్వాగతం పలుకుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ్ కా నేత కేసీఆర్' అని ఫ్లెక్సీపై రాశారు.

KCR
TRS
Uttar Pradesh
Varanasi
Flexi
Modi
BJP
  • Loading...

More Telugu News