Non Stop: ఆగిపోయిన 'బిగ్ బాస్ నాన్ స్టాప్' షో.. నిరాశలో ప్రేక్షకులు!
- ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్న నాన్ స్టాప్ షో
- నిన్న అర్ధరాత్రి ఆగిపోయిన స్ట్రీమింగ్
- గురువారం అర్ధరాత్రి మళ్లీ ప్రారంభిస్తామన్న నిర్వాహకులు
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో గత ఐదు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'బిగ్ బాస్ నాన్ స్టాప్' అంటూ కొత్త వర్షన్ ను షో మేనేజ్ మెంట్ ప్రారంభించింది. నాన్ స్టాప్ బిగ్ బాస్ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా లాంచ్ అయింది. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు ఈ షో ప్రసారంకానుంది. నాన్ స్టాప్ బిగ్ బాస్ కు కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే స్ట్రీమింగ్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే ప్రేక్షకులు మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అందరినీ నిరాశపరుస్తూ నిన్న అర్ధరాత్రి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. ఒక్కసారిగా షో ఆగిపోవడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. షో ఎందుకు ఆగిపోయిందో హాట్ స్టార్ వెల్లడించలేదు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది.