Moon: చైనా రాకెట్ శకలం వల్ల.. చంద్రుడికి త్రుటిలో తప్పిన ముప్పు!

Moon missed threat

  • చంద్రుడికి అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లిన అంతరిక్ష వ్యర్థం
  • గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వైనం
  • చంద్రుడిపై వందల కిలోమీటర్ల మేర పైకెగిసిన ధూళి

చంద్రుడికి అంతరిక్ష వ్యర్థాల నుంచి పెను ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక రాకెట్ శకలం చంద్రుడికి అత్యంత సమీపం నుంచి వెళ్లింది. గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. అది వెళ్లిన వేగానికి చంద్రుడిపై కొన్ని వందల కిలోమీటర్ల మేర ధూళి పైకెగిసింది. మరోవైపు ఈ రాకెట్ శకలం పరిశోధకుల టెలిస్కోపులకు కూడా చిక్కని సంగతి గమనార్హం. వందల కిలోమీటర్ల మేర ధూళి ఎగియడంతో సైంటిస్టులు అప్రమత్తం అయ్యారు. ఏదో జరిగిందని భావించారు. ఆ తర్వాత రాకెట్ శకలం దూసుకుపోయినట్టు గుర్తించారు. 

చంద్రుడి చుట్టూ దాదాపు 3 టన్నుల వ్యర్థాలు ఓ గోడలా పేరుకుపోయి ఉన్నాయి. ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని గుర్తించే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధించబోతున్నారు. పూర్తి వివరాలు తెలిసేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని వారు అంటున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం చైనా ప్రయోగించిన రాకెట్ శకలంగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. 2014లో చైనా అంతరిక్షనౌకను మోసుకెళ్లిన రాకెట్ శకలం ఇది అని భావిస్తున్నారు. అయితే, చైనా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. తాము పంపిన రాకెట్ ఎప్పుడో భూవాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయిందని తెలిపింది.

  • Loading...

More Telugu News