: టీచర్ ఆచూకీ లభ్యం
ఎస్సై వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన టీచర్ లీల ఆచూకీ లభించింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆమెను గుర్తించారు. మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెడతారని సమాచారం. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన టీచర్ లీల ఈ రోజు ఉదయం నుంచీ కనిపించకుండా పోయారు. తనను లైంగికంగా వేధిస్తున్న ఎస్సై సుధీర్ పై ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎస్సై బుధవారం సస్పెండ్ అయ్యారు. నాటకీయంగా టీచర్ లీల ఈ రోజు ఉదయం అదృశ్యమయ్యారు. ఎస్సైపై ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే లీలను చంపుతామంటూ ఆమె కుటుంబ సభ్యులకు తర్వాత బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లీల ఆచూకీ కనుక్కోగలిగారు.