Ukraine: ఇక యాపిల్ వంతు.. ర‌ష్యాపై ఆంక్ష‌ల విధింపు

apple stops its sales in russia

  • ర‌ష్యాపై కొన‌సాగుతు‌న్న ఆంక్ష‌ల ప‌రంప‌ర‌
  • త‌న ఉత్ప‌త్తుల అమ్మకాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు యాపిల్ ప్ర‌క‌ట‌న‌
  • యాపిల్ పే, ఇత‌ర సేవ‌ల‌ను కూడా ప‌రిమితం చేసిన‌ట్లు వెల్ల‌డి
  • ఇప్ప‌టికే త‌న కార్ల‌ను ర‌ష్యాకు ఎగుమ‌తి నిలిపివేస్తున్న‌ట్లుగా జాగ్వార్ ప్ర‌క‌ట‌న‌

ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో భీక‌ర యుద్ధానికి తెర తీసిన ర‌ష్యాపై ఆంక్ష‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ర‌ష్యా వైఖ‌రికి వ్య‌తిరేకంగా అమెరికాతో పాటు యూరోపియ‌న్ యూనియ‌న్‌, నాటో స‌భ్య దేశాలు కూడా ఆ దేశంపై ఆంక్ష‌లను విధించాయి. యుద్ధం మొద‌లై వారం గ‌డుస్తున్నా..ర‌ష్యా వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాని ఫ‌లితంగా ప‌లు పారిశ్రామిక సంస్థ‌లు కూడా ర‌ష్యాపై సంబంధాల‌ను నిలిపివేస్తున్నాయి.

ఇందులో భాగంగా త‌న లగ్జ‌రీ కార్ల‌ను ర‌ష్యాకు ఎగుమ‌తి చేసేది లేద‌ని మంగ‌ళవారం నాడు జాగ్వార్ ల్యాండ్ రోవ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టెక్ దిగ్గ‌జం యాపిల్ కూడా అదే బాట‌లో న‌డిచింది. 

రష్యాలో యాపిల్ కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు యాపిల్ బుధ‌వారం నాడు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. "మేము రష్యాలో అన్ని రకాల ఉత్పత్తి అమ్మకాలను నిలిపివేశాము. గత వారమే ఆ దేశానికి మా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాము" అని ఆ సంస్థ పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసినట్లు యాపిల్‌ పేర్కొంది.

  • Loading...

More Telugu News