Taj Mahal: తా‌జ్‌మహల్ సమీపంలో విమానం చక్కర్లు.. కలకలం

Aircraft spotted over Taj Mahals high security no flying zone

  • తాజ్ ప్రాంతంలో విమానాలు, డ్రోన్లపై  నిషేధం
  • విమానం అతి సమీపంగా రావడంతో ఆందోళన
  • సీఐఎస్ఎఫ్‌ను నివేదిక కోరిన ఆర్కియాలాజికల్ విభాగం

ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్లపై ఆంక్షలు ఉన్న వేళ ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్ పరిసర ప్రాంతాన్ని ‘నో ఫ్లైయింగ్’ జోన్‌గా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ దానిని నిర్మించిన షాజహాన్ చక్రవర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో  విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంగా రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన చెందారు.

 తాజ్ సమీపంలో విమానం ఎగురుతుండగా తాను కూడా చూశానని ఆగ్రా సర్కిల్ ఏఎస్ఐ కూడా చెప్పారు. విమానం చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను కోరింది.

  • Loading...

More Telugu News