Ukraine: చర్చలకు అంగీకరించిన ఉక్రెయిన్...రష్యా మీడియా వెల్లడి

Russia media says Ukraine willing to talks

  • ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు
  • నగరాలను హస్తగతం చేసుకునేందుకు రష్యా సేనల యత్నం
  • తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ దళాలు
  • బెలారస్ వేదికగా చర్చలకు రష్యా ప్రతిపాదన

గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ పోరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించినట్టు రష్యా మీడియా వెల్లడించింది. ఇంతకుముందు, బెలారస్ వేదికగా అయితే చర్చలకు తాము రాబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ చెప్పడం తెలిసిందే. 

అయితే, ఇప్పుడు బెలారస్ వేదికగా చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించిందని రష్యా మీడియా పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్న దశలో చర్చలకు మార్గం సుగమం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ అంశాన్ని ఉక్రెయిన్ వర్గాలు నిర్ధారించాల్సి ఉంది.

Ukraine
Russia
Talks
Belarus
  • Loading...

More Telugu News