ap police: ఏపీ పోలీసుకు అవార్డుల పంట
- టెక్నాలజీ సభ- 2022 అవార్డుల్లో ఏపీ 15 అవార్డులు
- ఇప్పటిదాకా మొత్తంగా 165 అవార్డులు
- ఫస్ట్ ప్లేస్‌లో ఏపీ పోలీసు శాఖ
టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీసు శాఖ సత్తా చాటుతోంది. గత మూడేళ్లుగా వరుసబెట్టి టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకుంటున్న ఏపీ పోలీసు శాఖ వరుసగా నాలుగో ఏడాది కూడా 15 అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొన్న ఏపీ పోలీసు శాఖ.. మొత్తమ్మీద 165 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది.
తాజాగా దక్కిన 15 అవార్డుల్లో పోలీస్ ప్రధాన కార్యాలయం (8), అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1) అవార్డులను దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అభినందించారు.
టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెరిగిందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించారు.