Pawan Kalyan: 'భీమ్లా నాయ‌క్' సినిమా హాళ్ల వ‌ద్ద ఫ్యాన్స్ ర‌చ్చ‌.. వీడియోలు ఇవిగో

pawan fans videos go viral

  • నేడు భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల‌
  • డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, నినాదాలు
  • ట‌పాసులు పేల్చుతూ హోరెత్తిస్తోన్న ఫ్యాన్స్

పవన్ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమా ఈ రోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ హీరోల అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, నినాదాలు చేస్తూ, ట‌పాసులు పేల్చుతూ హోరెత్తిస్తున్నారు.

ఈ రోజు ఉద‌యం నుంచి భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌వుతోన్న సినిమా హాళ్ల వ‌ద్ద ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

  • Loading...

More Telugu News