: వైద్యశాఖా మంత్రిని ఘెరావ్ చేసిన జూడాలు


హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రి పసిబిడ్డలకు వైద్యమందించడం లేదని, వైద్యానికి వస్తున్న వారిని అక్కడి వైద్యులు ఇతర ఆసుపత్రులకు తరలిపొమ్మంటున్నారని గత వారం రోజులుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలో అధికారుల తీరుతో ఆగ్రహించిన ఉస్మానియా విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి ముందు భిక్షాటన చేసారు. దీంతో వైద్యశాఖ మంత్రి కొండ్రు మురళి ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చారు. దీంతో తమకు మౌలికవసతులు కల్పించాలని, తమపై దాడులు అరికట్టాలని మంత్రిని జూనియర్ డాక్టర్లు ఘెరావ్ చేసారు. చేయని తప్పులకు తాము శిక్ష అనుభవిస్తుంటామని, ప్రభుత్వాలు సరైన సౌకర్యలు కల్పిస్తే ప్రజలకు మంచి చేసినవారౌతారని, తమపై దాడులు కూడా ఆపినవారు అవుతారన జూడాలు మంత్రిని వేడుకున్నారు.

  • Loading...

More Telugu News