sensex: యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. 2,702 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Sensex looses 2702 points due to war between Russia and Ukraine

  • ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా బలగాలు
  • 815 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 100 డాలర్లు దాటిన బ్యారెల్ క్రూడాయిల్ ధర

ఉక్రెయిన్ పై రష్యా వార్ డిక్లేర్ చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ బెంబేలెత్తిపోతోంది. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా... ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా వెళ్తోంది. యుద్ధం ప్రభావంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లను దాటింది. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

మన దేశీయ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2,702 పాయింట్లు పతనమయ్యాయి. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయి 16,247కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు భారీగా నష్టపోయాయి. రియాల్టీ సూచీ 7.59 శాతం ఆటో, టెలికాం సూచీలు 6 శాతానికి పైగా కోల్పోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-6.15%), బజాజ్ ఫైనాన్స్ (-6.02%), యాక్సిస్ బ్యాంక్ (-5.99%), టెక్ మహీంద్రా (-5.75%)లు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.

  • Loading...

More Telugu News