Russia: సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి.. ఉక్రెయిన్ లోని భారతీయులకు రాయబార కార్యాలయం సూచనలు

Indian Embassy Advisory To Indians In Ukraine

  • ఎప్పుడు ఏం జరిగేది తెలియట్లేదు
  • కీవ్ కు వెళ్లేవాళ్లు, కీవ్ నుంచి వెళుతున్న వారు వెంటనే వెనక్కు వెళ్లిపోండి
  • పాశ్చాత్య దేశాల సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాలని సూచన

ఉక్రెయిన్ లోని యుద్ధ పరిస్థితులపై అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలను చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించింది. భారతీయులంతా ఎక్కడున్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, ఇల్లు, హాస్టల్ లేదా ప్రయాణాల్లో ఉన్నా భద్రంగా ఉండాలని సూచన చేసింది.

కీవ్ కు వెళ్లేవాళ్లు, కీవ్ నుంచి వేరే సిటీలకు వెళుతున్న వారు వెంటనే తమ తమ ఇళ్లకు వెనక్కు వెళ్లిపోవాలని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొంది. ఉక్రెయిన్ లోని పాశ్చాత్య దేశాల సరిహద్దుల వెంబడి ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తుంటామని తెలిపింది.

Russia
Ukraine
Indian Embassy
  • Loading...

More Telugu News