Air India: ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. ఖాళీగా వెనుదిరిగిన భారత విమానం
- ఉక్రెయిన్ తూర్పున ఉన్న నగరాల్లో విమానాశ్రయాల మూసివేత
- పౌర విమాన ప్రయాణాల నిషేధం
- తూర్పు ఉక్రెయిన్లోని గగనతలం డేంజర్
జోన్‌గా ప్రకటన
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్ పోర్టులను మూసివేసింది. అలాగే, పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు ఉక్రెయిన్లోని గగనతలాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లోనే భారత్ సహా పలు దేశాల పౌరులు చిక్కుకుపోయారు.
భారతీయులను వెంటనే వెనక్కు వచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం ఎయిర్ ఇండియా విమానం AI1947 భారతీయులను తీసుకురావడానికి ఉక్రెయిన్ వెళ్లగా, ఆ దేశంలోకి అనుమతి దొరకకపోవడంతో తిరిగి న్యూఢిల్లీకి మళ్లింది. దీంతో ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.