YSRTP: షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు.. ప్రస్తుతానికి రాజగోపాలే అధ్యక్షుడు

YSRTP Got Election Commission Recognisation

  • పార్టీ పేరును రిజిస్టర్ చేయాల్సిందిగా డిసెంబరు 2020లో ఈసీకి దరఖాస్తు
  • వివిధ కారణాల వల్ల ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్ పెండింగ్
  • త్వరలోనే షర్మిల పేరును ఈసీకి పంపనున్న పార్టీ

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్‌కు మొన్న ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో రాజగోపాల్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా, షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు.

అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పెండింగులో ఉంటూ వచ్చింది. తాజాగా, ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి వాడుక రాజగోపాలే అధ్యక్షుడుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News