Russia: రష్యా దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికుల మృతి!
- తమ భూభాగంలోకి చొరబడ్డారన్న రష్యా
- అందుకే చంపేశామంటూ అధికారిక ప్రకటన
- అదేమీ లేదంటూ ఖండించిన ఉక్రెయిన్
- ఉక్రెయిన్‌పైకి సైబర్ దాడులకు రష్యా సిద్ధం
రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తత యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్న నేపథ్యంలో.. తమ భూభాగంలోకి చొరబడ్డారన్న ఆరోపణలతో ఉక్రెయిన్‌కు చెందిన ఐదుగురు సైనికులను రష్యా కాల్చిచంపింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడిన కారణంగానే ఉక్రెయిన్ సైనికులను చంపేసినట్లుగా రష్యా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది.
ఇదిలా ఉంటే.. ఇరు దేశాల సరిహద్దులో పరిస్థితులు చల్లారినట్లే కనిపిస్తున్నప్పటికీ.. పశ్చిమ భాగంలో ఇరు దేశాల సైనికుల మోహరింపులు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల్లో రష్యాకు ఆస్తి నష్టం వాటిల్లుతుండడం లాంటి పరిణామాలు నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై సైబర్ దాడుల కోసం రచించిన ప్లాన్‌ను రష్యా అమల్లో పెట్టేసిందన్న వార్తలు కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయి.