Polling: పంజాబ్ లో ముగిసిన పోలింగ్... మార్చి 10న ఓట్ల లెక్కింపు

Polling concludes in Punjab

  • ఒకే విడతలో పంజాబ్ లో పోలింగ్
  • మొత్తం 117 స్థానాలకు పోలింగ్
  • సాయంత్రం 5 గంటల సమయానికి 63 శాతం ఓటింగ్
  • యూపీలో మూడో విడత పోలింగ్
  •  60.18 శాతం ఓటింగ్

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల సమయానికి 63 శాతం పోలింగ్ నమోదైంది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్లలో ప్రవేశించినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 93 మంది మహిళలు కాగా, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. మార్చి 10న ఓట్లు లెక్కించనున్నారు.

అటు, ఉత్తరప్రదేశ్ లో నేడు మూడో విడత పోలింగ్ నిర్వహించారు. 59 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి 60.18 శాతం ఓటింగ్ నమోదైంది. 2.06 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Polling
Punjab
Assembly Elections
Uttar Pradesh
Third Phase
  • Loading...

More Telugu News