Sensex: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Markets ends in losses

  • 59 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.88 శాతం నష్టపోయిన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ప్రభావంతో మన మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం లాభాల్లోకి మళ్లి, చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 57,832కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 17,276 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.25%), ఎల్ అండ్ టీ (0.66%), యాక్సిస్ బ్యాంక్ (0.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.52%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.44%).

టాప్ లూజర్స్: అల్ట్రాటెక్ సిమెంట్ (-1.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.36%), ఇన్ఫోసిస్ (-1.06%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.85%), బజాజ్ ఫైనాన్స్ (-0.74%).

  • Loading...

More Telugu News