Microsoft Edge browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు సీఈఆర్టీ తాజా హెచ్చరిక
- ముందు వెర్షన్లలో లోపాలు
- వీటి ఆసరాగా సైబర్ దాడులకు అవకాశం
- 98 వెర్షన్ కు మారిపోవాలని సూచన
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ పాత వెర్షన్ ను వినియోగిస్తున్న యూజర్లను కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) హెచ్చరించింది. 98.0.1108.55 వెర్షన్ కు ముందు ఎడ్జ్ బ్రౌజర్ లో పలు లోపాలను గుర్తించినట్టు ప్రకటించింది. వీటిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించింది. ఆర్బిట్రరీ కోడ్ ను అమలు చేయడానికి, భద్రతా పరిమితులను అధిగమించడానికి ఈ లోపాలు అవకాశమిస్తాయని తెలిపింది.
ఎటువంటి సైబర్ దాడులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తే వెంటనే ఎడ్జ్ వెర్షన్ 98కు మారిపోవాలని సీఈఆర్టీ సూచించింది. 98.0.1108.55 వెర్షన్ కు యూజర్లు ఎడ్జ్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది. ఆధునిక సెక్యూరిటీ అప్ డేట్స్ తో మైక్రోసాఫ్ట్ తాజా వెర్షన్ ను ఈ వారమే అందుబాటులోకి తీసుకొచ్చింది.