super foods: కేన్సర్ నుంచి రక్షణ కల్పించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!

Five super foods that show cancer fighting properties

  • ఆహారంతో చాలా వరకు రక్షణ
  • పసుపు, అవిసె గింజెలు, మష్ రూమ్స్ తో మంచి ఫలితాలు
  • కేన్సర్లపై పోరాడే గుణాలు పుష్కలం

ఆహారమే ప్రాణం, ఆహారమే జీవం అని వేదం చెబుతోంది. ఆహారమే ఆరోగ్యం అన్న సత్యాన్ని కూడా మనం అంగీకరించాల్సిందే. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు కలసి కేన్సర్ మహమ్మారిని వ్యాపింపజేస్తున్నాయి. కనుక కేన్సర్ ను నిరోధించే ప్రత్యేకతలున్న పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ముందు నుంచే రక్షణ కల్పించుకోవచ్చు. కేన్సర్ వచ్చిన వారు సైతం వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.  

అవిసె గింజలు:  అవిసె గింజలను ఫ్లాక్స్ సీడ్స్ గా చెబుతారు. వీటిల్లో ఉండే లిగ్నాన్స్  బ్రెస్ట్ కేన్సర్ వంటి ఈస్ట్రోజెన్ ఆధారిత కేన్సర్ల నుంచి రక్షణ నిస్తాయి. అవిసె గింజెలు, అవిసె నూనెలో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేన్సర్ నుంచి రక్షణగా నిలుస్తాయి.

పసుపు:
పసుపు ఆరోగ్య ప్రదాయనిగా ఎక్కువ మందికి తెలుసు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పసుపుకు ఉన్నాయి. శరీరంలో వాపును (ఇన్ ఫ్లమ్మేషన్) కూడా తగ్గిస్తుంది. కేన్సర్ కణాలను పసుపు నిరోధిస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, లంగ్, స్కిన్ కేన్సర్ల నుంచి రక్షణగా దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

బ్లూబెర్రీ: 
 బ్లూబెర్రీలలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్రెస్ట్ కేన్సర్ నుంచి రక్షణకు ఇవి సాయపడతాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ బ్రెస్ట్ కేన్సర్ విస్తరించకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కు కేన్సర్ నిరోధక గుణాలున్నాయి.

బ్రకోలి:
 బ్రొక్కోలి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటోంది. ఇందులో ఉండే ఇండోల్ 3 కార్బినోల్ ఈస్ట్రోజెన్ జీవక్రియను మార్చగలదు. తద్వారా బ్రెస్ట్ ట్యూమర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. హార్మోన్లపై ఆధారపడిన బ్రెస్ట్, సర్వికల్, ప్రొస్టేట్ కేన్సర్ల నుంచి రక్షణ కోసం బ్రకోలిని తీసుకోవాలి.

పుట్టగొడుగులు:
 మష్ రూమ్స్ లో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ వైరల్ గుణాలున్నాయి. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, రక్తంలో షుగర్ స్థాయులను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. విటమిన్ బీ3, విటమిన్ బీ2 ఎక్కువగా లభిస్తాయి. మష్ రూమ్స్ ను తీసుకోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని దక్షిణ కొరియా అధ్యయనం ఒకటి తేల్చింది.

  • Loading...

More Telugu News