Cricket: ధోనీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు: న్యూజిలాండ్ మాజీ దిగ్గజం

Raina Lost Faith To Dhoni Says Newzealand Former Simon Doull

  • వేలంలో రైనాను కొనుగోలు చేయని జట్లు
  • రెండు మూడు కారణాలున్నాయన్న సైమన్ డూల్
  • యూఏఈలోనే అతడిపై నమ్మకం పోయిందని కామెంట్

సురేశ్ రైనా.. ఐపీఎల్ కింగ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అలాంటి స్టార్ ఆటగాడికి ఈసారి ఐపీఎల్ లో చుక్కెదురైంది. ఏ జట్టూ అతడిని వేలంలో దక్కించుకోలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దానిపై న్యూజిలాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు సైమన్ డూల్ స్పందించాడు. సీఎస్ కే అతడిని మూడు కారణాల వల్ల వదిలేసిందని చెప్పాడు. ఇతర ఫ్రాంచైజీలూ వాటిని పరిగణనలోకి తీసుకున్నాయన్నాడు.

‘‘రైనాను ఎవరూ తీసుకోకపోవడానికి రెండు మూడు కారణాలున్నాయి. యూఏఈలోనే అతడిపై నమ్మకం పోయింది. ఎందుకూ అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. దాని గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎస్కేతో పాటు ధోనీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు. ఒక్కసారి అది జరిగిందా.. మళ్లీ జట్టులోకి తిరిగి రావడమన్నది జరగదు. అతడు ఫిట్ గా లేడు. షార్ట్ పిచ్ బంతులంటే భయం’’ అని డూల్ చెప్పాడు.

కాగా, ఐపీఎల్ లో 205 మ్యాచ్ లాడిన రైనా.. 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టించాడు.

  • Loading...

More Telugu News