Green India Challenge: అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగ్.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాప‌న‌

akkineni participates in green india challenge
  • కేసీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం
  • మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లో అడ‌వి
  • ద‌త్త‌త స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌
తెలంగాణ‌లో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ న‌టుడు అక్కినేని నాగార్జున గ‌తంలో ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అక్కినేని అమ‌ల‌, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి వెళ్లి మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లో నాగార్జున‌ అడ‌విని దత్త‌త తీసుకున్నారు.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేశారు. అలాగే, కేసీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడ‌విని ద‌త్త‌త తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైత‌న్య, అఖిల్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  





Green India Challenge
Nagarjuna
Ch Malla Reddy

More Telugu News