Vijayawada: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన మహిళకు రిమాండ్ విధించిన కోర్టు

Woman who attacked on RTC driver sent to remand
  • విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన మహిళ
  • ప్రయాణికులు వారిస్తున్నా పట్టించుకోని వైనం
  • 15 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
విజయవాడలో ఓ ఆర్టీసీ డ్రైవర్ పై ఒక మహిళ దాడి చేసిన సంగతి తెలిసిందే. 5వ నంబర్ బస్ రూట్ లో రాంగ్ రూట్ లో ఓ మహిళ వచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేసి బస్సును ఆపేశాడు సదరు డ్రైవర్. అయినా, తన వాహనానికి బస్సు తగిలిందంటూ డ్రైవర్ పై ఆమె దాడికి దిగింది. ప్రయాణికులు వారిస్తున్నా ఆమె వినలేదు. డ్రైవర్ పై పిడిగుద్దులు కురిపించింది. కాళ్లతో తన్నుతూ రచ్చ చేసింది. అయితే వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Vijayawada
Woman
RTC Driver
Attack

More Telugu News