Railways: రైల్వే డోర్ టు డోర్ సర్వీస్

Railways eyes door to door delivery

  • కస్టమర్లు కోరుకున్న చోట నుంచి పికప్
  • సరుకు రవాణాలో వాటా పెంచుకునే యోచన
  • ఇండియా పోస్ట్ తో భాగస్వామ్యానికి అవకాశం

రైల్వే శాఖ తన సేవలను మరిన్ని విభాగాల్లో విస్తరించే ప్రణాళికలతో ఉంది. వ్యక్తులు, వ్యాపార సంస్థలకు ఇంటి వద్దకే (డోర్ టు డోర్) డెలివరీ సేవలను అందించాలని భావిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను పరీక్షిస్తోంది. కొరియర్ కంపెనీలు, ఈ కామర్స్ డెలివరీ మాదిరే సేవలను అందించనుంది.

ఇండియా పోస్ట్ తోను భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అనుకుంటోంది. తద్వారా సరుకు రవాణా వ్యాపారాన్ని విస్తరించుకునే ఆలోచనతో ఉంది. ఢిల్లీ ఎన్ సీఆర్, గుజరాత్ లోని సనంద్ సెక్టార్ లో ఈ ఏడాది జూన్-జూలై నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనేది రైల్వే శాఖ ప్రణాళిక.

‘‘వైట్ గూడ్స్ (ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు), చిన్న వస్తువుల రవాణాను లక్ష్యం పెట్టుకున్నాం’’ అని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ (డీఎఫ్ సీసీ) అధికారి ఒకరు తెలిపారు. సంస్థ ఎంపిక చేసిన పాయింట్ల వద్ద డెలివరీ చేయాల్సిన వస్తువులను అందించడం; లేదంటే ఇల్లు, కార్యాలయాల నుంచి పికప్ చేసుకునే ఆప్షన్ ఇవ్వనున్నట్టు డీఎఫ్ సీసీ తెలిపింది. కస్టమర్లు కోరితే రవాణా చేయాల్సిన వస్తువులకు ప్యాకింగ్ చేసే బాధ్యతను కూడా రైల్వే తీసుకోనుంది.

  • Loading...

More Telugu News