Prabhas: 'ఆది పురుష్' కోసం 'అవతార్' టెక్నాలజీ!

Adi Purush movie update

  • పౌరాణిక నేపథ్యంలో 'ఆది పురుష్'
  • 500 కోట్ల బడ్జెట్ తో భారీ నిర్మాణం
  • గ్రాఫిక్స్ కోసం ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు
  • ఆగస్టు 11వ తేదీన పాన్ ఇండియా రిలీజ్

ప్రభాస్ తన కెరియర్లో మొదటిసారిగా పౌరాణిక చిత్రమైన 'ఆది పురుష్' చేశాడు. ఈ జనరేషన్ లో ఇంతటి భారీ అవకాశం ఆయనకి రావడం నిజంగా విశేషమే. ఓంరౌత్ దర్శకత్వంలో .. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కొన్ని రోజుల క్రితం షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ వర్క్ ను జరుపుకుంటోంది.

హాలీవుడ్ మూవీ 'అవతార్' కోసం ఉపయోగించిన టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారట. దేశ విదేశాలకి చెందిన 50 మంది సాంకేతిక నిపుణుల టీమ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 60 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు.

రామాయణం నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలకి మించి ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. సీతారాములుగా కృతి సనన్ - ప్రభాస్ నటించగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవదత్త .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News