Andhra Pradesh: రాజధాని లేని ఏపీ.. నాలుగో తరగతి పాఠ్యపుస్తకంలోని మ్యాప్‌ నుంచి ఏపీ రాజధాని మాయం!

There is no AP Capital In 4th class lesson

  • ‘మన ప్రపంచం’ సెమిస్టర్-2 పుస్తకంలో భారతదేశ పటం
  • అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానుల గుర్తింపు
  • ఏపీని మాత్రం రాష్ట్రం పేరు చెప్పి చేతులు దులుపుకున్న వైనం

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న అస్పష్టత విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది.  నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన భారతదేశం పటం నుంచి ఏపీ రాజధాని మాయమైంది. సెమిస్టర్-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకం చివర్లో భారతదేశ మ్యాప్‌ను ముద్రించారు. ఈ పఠంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల, కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవలం ‘ఆంధ్రప్రదేశ్’ అని చూపించి వదిలేశారు.

అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్రం పేరు చెప్పి వదిలేయడంపై ఉపాధ్యాయులు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ గురించి ఏమని చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

కాగా, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి గాను ఈ కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో మూడు సెమిస్టర్లుగా విభజించి పుస్తకాలను ముద్రించారు. రెండో సెమిస్టర్ పుస్తకంలో ఈ మ్యాప్‌ను ముద్రించారు.

  • Loading...

More Telugu News