Sensex: ఆర్బీఐ నిర్ణయంతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 460 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 142 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.11 శాతం పెరిగిన టాటా స్టీల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ నిర్ణయించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,926కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 17,606కి పెరిగింది. కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.11%), ఇన్ఫోసిస్ (1.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.77%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.64%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.60%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%), నెస్లే ఇండియా (-0.38%) రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.21%).

  • Loading...

More Telugu News