Jagan: విశాఖ శారదాపీఠం యాగంలో పాల్గొన్న జగన్

Jagan participated in Visakha Sharada Peetam

  • శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం
  • అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహణ
  • వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేత

విశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. అనంతరం శారదాపీఠంలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు జగన్ ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.

Jagan
YSRCP
Visakha Sharada Peetam
  • Loading...

More Telugu News