Aadhaar card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. తిరిగి ఇలా పొందొచ్చు!

Lost your Aadhaar Here Is how you can get it back

  • ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • మొబైల్ లో ఎంఆధార్ యాప్
  • పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. కనుక దీని అవసరం ఎంతో ఉంది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారమే!

మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు కనిపించకుండా పోతే..? తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోయినా కనీసం నంబర్ ఉంటే చాలు. లేదంటే వర్చువల్ ఐడీ, ఎన్ రోల్ మెంట్ ఐడీ అయినా కావాలి. ఆధార్ నంబర్ తోపాటు, ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటే పొందడం చాలా సులభమే.

https://eaadhaar.uidai.gov.in/#/ పోర్టల్ కు వెళ్లి ఆధార్ కార్డును పొందొచ్చు. ఎంఆధార్ మొబైల్ యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఈ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చట్టపరంగా భౌతిక ఆధార్ కార్డుకు, ఈ ఆధార్ సమానమే. ఈ ఆధార్ ను https://eaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar పోర్టల్ కు వెళ్లి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ పీవీసీ కార్డును సైతం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. ఇందుకోసం రూ.50 చెల్లించాలి. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందొచ్చు.

  • Loading...

More Telugu News