KFC: చిక్కుల్లో ‘కేఎఫ్‌సీ’.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ కేఎఫ్‌సీ’

BoycottKFC trends online after solidarity with Kashmir post by brands Pakistan account

  • కశ్మీర్ కశ్మీరీలకే చెందుంటూ పాక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు
  • నెటిజన్ల ఆగ్రహంతో దిగొచ్చిన కేఎఫ్‌సీ
  • వెంటనే పోస్టు డిలీట్
  • క్షమాపణలు చెబుతూ వివరణ

ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ చిక్కుల్లో పడింది. ‘బాయ్‌కాట్ కేఎఫ్‌సీ’ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగులో ఉంది. ఆ సంస్థ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే ఇందుకు కారణం.  పాకిస్థాన్ ‘కశ్మీర్ డే’ను జరుపుకునే ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన పోస్టు ఫేస్‌బుక్‌లో షేర్ అయింది.

ఆ వెంటనే ఇది వైరల్ కావడంతో భారత్‌లోని నెటిజన్లు కేఎఫ్‌సీపై మండిపడ్డారు. #BoycottKFC పేరుతో కేఎఫ్‌సీపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడడంతో అదికాస్తా ట్రెండింగ్ అయింది. పాక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్ చేసినప్పటికీ అప్పటికే కొందరు దాని స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.

‘‘మీరు మా గురించిన ఆలోచనలను ఎప్పుడూ మర్చిపోలేరు. భవిష్యత్తులో మీకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని దానికి క్యాప్షన్ తగిలించింది. అంతేకాదు, ‘కశ్మీర్ కశ్మీరీలకే చెందుతుంది’ అని ఫొటోపై రాసుకొచ్చింది.

పోస్టును డిలీట్ చేసిన తర్వాత కేఎఫ్‌సీ ఇండియా క్షమాపణలు తెలిపింది. దేశం వెలుపల కేఎఫ్‌సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. భారత్‌ను తాము గౌరవిస్తామని చెప్పుకొచ్చింది. భారతీయులందరికీ నిబద్ధతతో సగర్వంగా సేవలు అందిస్తామని వివరించింది.
 
కశ్మీర్‌కు సంఘీభావం తెలిపిన కేఎఫ్‌సీ పోస్టు వైరల్ అయిన తర్వాత నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.. వాటిలో కొన్ని ఇలా

* కేఎఫ్‌సీ ఫుడ్ నేనెప్పుడూ తిననందుకు ఆనందంగా ఉంది
* స్నేహితుడి కోసం ఏమైనా తీసుకెళ్దామని కేఎఫ్‌సీ ముందు నిల్చున్నా. అప్పుడే ఈ పోస్టు నా కంటపడింది. వెంటనే హల్దీరామ్‌కు వెళ్లిపోయా. బై బై కేఎఫ్‌సీ
* నేను విజిటేరియన్‌ను. కేఎఫ్‌సీ నుంచి నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. ఇకపై తినను కూడా
* క్షమాపణలు ఒక్కటే సరిపోవు

  • Loading...

More Telugu News