Pilli Subhas Chandra Bose: పార్లమెంటులో కళ్లు తిరిగి పడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఐసీయూలో చికిత్స

YSRCP MP Pilli Subhas Chandra Bose fell down in Parliament

  • బీపీ, షుగర్ పడిపోవడంతో అస్వస్థత 
  • రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలింపు
  • ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఆసుపత్రి వర్గాలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహచర ఎంపీలు, సిబ్బంది స్ట్రెచర్ తెప్పించారు. హుటాహుటిన ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News