Revanth Reddy: కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy complains police against CM KCR
  • కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్
  • బడ్జెట్ అనంతరం రగిలిపోతున్న వైనం
  • రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు
  • కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
కొంతకాలంగా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు, సీఐ వరప్రసాద్ కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.
Revanth Reddy
CM KCR
Police
Complaint
Congress
Telangana

More Telugu News