Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ సాంగ్ రిలీజ్!

Adavallu Meeku Joharlu title song released

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
  • శర్వానంద్ సరసన నాయికగా రష్మిక
  • దర్శకుడిగా కిశోర్ తిరుమల
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల

శర్వానంద్ - రష్మిక జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమాను పూర్తిచేయడం విశేషం. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని అంటారు .. కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాళ్లు .. ఆడాళ్లూ మీకు జోహార్లు" అంటూ ఈ పాట సాగుతోంది. మనసు పడిన అమ్మాయితో తన పెళ్లి ఆలస్యమవుతుండటానికి కొంతమంది ఆడవాళ్లను బాధ్యులను చేస్తూ హీరో పాడే పాట ఇది.

శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ ఆలపించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న శర్వానంద్ కి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News