Bandi Sanjay: ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay fires on KCR after Mouna Deeksha

  • రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్
  • ఆయనకు అంత అహంకారం ఎందుకన్న సంజయ్
  • జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని కూడా మార్చాలంటాడేమో

భారత రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ చేసిందే తప్పంటుంటే... ఆ వ్యాఖ్యలను సమర్థించేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఒక సామాన్యుడు ఈ దేశానికి ప్రధాని అయ్యాడంటే దానికి కారణం అంబేద్కరే అని అన్నారు. తమ ప్రభుత్వం అంబేద్కర్ ను సగౌరవంగా సత్కరిస్తోందని చెప్పారు.

అంబేద్కర్ రాజ్యాంగం మాకొద్దు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయొద్దు అనే విధంగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలంటాడేమోనని ఎద్దేవా చేశాడు.

  • Loading...

More Telugu News