Pushpa: వేడుకలో భోజనాల వేళ సైతం.. 'పుష్ప' శ్రీ‌వ‌ల్లి స్టెప్పులు.. క‌డుప్పుబ్బా న‌వ్విస్తోన్న‌ వీడియోలు ఇవిగో!

PushpaTheRise dance video goes viral

  • పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌ల్లో పుష్ప స్టెప్పుల హోరు
  • సామాజిక మాధ్యమాల్లో నిండిపోతోన్న డ్యాన్సులు
  • ఇప్ప‌టికీ త‌గ్గని 'పుష్ప' మేనియా

తెలుగు, హిందీతో పాటు పాటు దేశంలోని ప‌లు భాష‌ల్లో 'పుష్ప' జోరు మామూలుగా లేదు. ఆ సినిమాలో బ‌న్నీ వేసిన స్టెప్పులను పలుచోట్ల పలువురు ప్ర‌ముఖులు వేస్తూ అల‌రిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో పుష్ప స్టెప్పులతో పోస్టులు నిండిపోతున్నాయి. ఈ సినిమా గ‌త ఏడాది డిసెంబ‌రు 17న‌ విడుద‌లైనప్ప‌టికీ, దాని క్రేజ్ ఇంకా కొన‌సాగుతోంది.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి విభిన్న‌ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే ఓటీటీలోనూ విడుద‌లైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

ఈ నేప‌థ్యంలో పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌లు అన్నింటా శ్రీ‌వ‌ల్లి పాట‌కు డ్యాన్సులు వేస్తున్నారు. భోజనాల స‌మ‌యంలోనూ పుష్ప శ్రీ‌వ‌ల్లి స్టెప్పులు వేసిన వారు కొంద‌రైతే, మ‌రికొంద‌రు ఆ స్టెప్పుల‌ను బొమ్మ‌ల‌తోనూ వేయిస్తూ క్రియేటివిటీ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అలా.. క‌డుప్పుబ్బా న‌వ్విస్తోన్న‌ వీడియోలు ఇవిగో..

  • Loading...

More Telugu News