india: క్రిప్టోలను ప్రభుత్వం గుర్తించినట్టే : వాజిర్ ఎక్స్

India has accepted crypto

  • పన్నును విధించడం అంటే ఆమోదించినట్టే
  • క్రిప్టోలు నిలిచే ఉంటాయ్
  • లాభంపై 30 శాతం పన్ను

క్రిప్టో కరెన్సీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని, చట్టబద్ధం చేయాలని పరిశ్రమ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తోంది.  క్రిప్టో కరెన్సీలన్నవి ఏదో ఒక దేశం నియంత్రించేవి కావు. కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని, కలసి నడిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అయితే, భారత్ వీటిని నియంత్రిస్తూ ఒక చట్టం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ క్రమంలోనే బడ్జెట్ లో క్రిప్టో వంటి ఆస్తులపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు.

పన్నును విధించడం అంటే క్రిప్టో కరెన్సీలను ఆమోదించినట్టేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీనిపై దేశీయంగా క్రిప్టో కరెన్సీలకు సంబంధించి అతిపెద్ద ఎక్చేంజ్ వాజిర్ఎక్స్ స్పందించింది. ‘‘క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేసే దిశగా భారత్ ముందడుగు వేసింది. గౌరవ ఆర్థిక మంత్రి వర్చువల్ డిజిటల్ అసెట్స్ పై పన్నును ప్రకటించారు. క్రిప్టోలు ఎప్పటికీ ఉంటాయని భారత్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది’’ అని వాజిర్ ఎక్స్ ట్రేడ్ డెస్క్ పేర్కొంది. క్రిప్టోల లాభాలు, డిజిటల్ ఆస్తుల బదిలీలపై 30 శాతం పన్నును ప్రకటించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News