Raviteja: రవితేజ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ!

Dhamaka movie update

  • హీరోగా పలు సినిమాలు చేసిన వేణు 
  • క్యారెక్టర్ ఆర్టిస్టుగాను వరుస సినిమాలు
  • కొంతకాలంగా సినిమాలకి దూరం
  • రీ ఎంట్రీ ఆలోచన చేస్తున్నాడనే టాక్  

వేణు తొట్టెంపూడి పేరు వినగానే 'స్వయంవరం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత వచ్చిన 'హనుమాన్ జంక్షన్' .. ' పెళ్ళాం ఊరెళితే' వంటి సినిమాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఒక వైపున సోలో హీరోగా .. మరో వైపున మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తూ ఆయన ప్రేక్షకులను అలరించాడు.

ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కనిపించాడు. కెరియర్ పరంగా బిజీగా ఉండగానే ఆయన సినిమాలకి దూరమయ్యాడు. మళ్లీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా చేస్తున్న 'ధమాకా' సినిమాలో వేణు ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం మరో హీరో ఉంటే బాగుంటుందని అనుకున్నారట. అలా ఇటీవల కొంతమంది హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా వేణు పేరు తెరపైకి వచ్చింది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Raviteja
Sreeleela
Venu Tottempudi
Dhamaka Movie
  • Loading...

More Telugu News