India: గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Indias daily cases drop below 2 lakh

  • గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు
  • దేశ వ్యాప్తంగా 1,192 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 17,43,059

భారత్ లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2 లక్షల కంటే తక్కువగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక ఇదే సమయంలో 1,192 మంది కరోనా కారణంగా మృతి చెందగా... 2,54,076 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,66,68,48,204 డోసుల వ్యాక్సిన్ వేశారు.

India
Corona Virus
Cases
Updates
  • Loading...

More Telugu News