Venkatesh Daggubati: తండ్రీకొడుకులుగా తెరపైకి వెంకటేశ్, రానా!

Bro Daddy Movie Remake

  • మలయాళంలో హిట్ కొట్టిన 'బ్రో - డాడీ'
  • తండ్రీకొడుకులుగా మోహన్ లాల్ .. పృథ్వీరాజ్
  • సురేశ్ బాబుకి నచ్చిన కథ 
  • తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్

తెలుగులో ఒకప్పుడు తమిళ .. హిందీ సినిమాల రీమేక్ లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాల రీమేకులు ఎక్కువగా సందడి చేస్తున్నాయి. మలయాళ సినిమాల్లో కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి .. పాత్రలు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తాయి. ఈ ప్రత్యేకత కారణంగానే ప్రేక్షకులు మలయాళ సినిమాలను ఇష్టపడుతున్నారు.

ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానే అక్కడి కథలను ఇక్కడి దర్శక నిర్మాతలు రీమేక్ చేస్తున్నారు. అలా తాజాగా మలయాళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'బ్రో డాడీ' సినిమా సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా .. పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుందట. అలా ఈ సినిమా రీమేక్ తో వెంకటేశ్ - రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారన్న మాట.

Venkatesh Daggubati
Rana Daggubati
Bro Daddy Movie
  • Loading...

More Telugu News