Telangana: తగ్గిన కరోనా తీవ్రత.. తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు!

Schools opened in Telangana

  • రేపటి నుంచి స్కూళ్లను ప్రారంభిస్తామన్న సీబీఎస్ఈ పాఠశాలలు
  • మరికొన్ని రోజులు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించిన కొన్ని పాఠశాలలు
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించిన ప్రభుత్వం

కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు ఈరోజు తెరుచుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. తాజాగా కరోనా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం... విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, సీబీఎస్ఈ పాఠశాలలు మాత్రం ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. మరికొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని నిర్ణయించాయి. మరోవైపు క్లాసులను నిర్వహించే క్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

Telangana
Schools
Reopen
  • Loading...

More Telugu News