Sensex: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- ఈ ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు
- 814 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 238 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈరోజు ఆమె ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 814 పాయింట్లు లాభపడి 58,014కి చేరుకుంది. నిఫ్టీ 238 పాయింట్లు పుంజుకుని 17,340కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.88%), విప్రో (3.70%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.22%), ఇన్ఫోసిస్ (3.05%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.87%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.38%).