Nagachaitanya: రష్యాలో జోరుగా 'థ్యాంక్యూ' షూటింగ్!

Thank you movie update

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'
  • చైతూ జోడీగా రాశి ఖన్నా
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఈ ఏడాదిలోనే విడుదల    

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగు మొదలుపెట్టి చాలాకాలమే అయింది. అయితే కరోనా కారణంగా విదేశాల్లో చేయవలసిన సీన్స్ పెండింగ్ ఉండిపోయాయి. ఇక చైతూ ఒక నాలుగు నెలలుగా 'బంగార్రాజు' సినిమాతో బిజీగా ఉండటం ఆలస్యానికి మరో కారణం.

ఇక ఇప్పుడు ఈ సినిమా రష్యాలో షూటింగు జరుపుకుంటోంది. చైతూ - రాశి ఖన్నా కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఇక చైతూ .. రాశి ఖన్నా .. ప్రకాశ్ రాజ్ మధ్య ఎమోషనల్ సీన్స్ ను కూడా అక్కడ ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయి? వాళ్లతో చైతూ ప్రయాణం ఎలా సాగుతుంది? అనేవి ఆసక్తిని పెంచుతున్నాయి. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News