Kadapa District: కనుమరుగు కాబోతున్న కడప.. ఇక చరిత్రపుటలకే పరిమితం!

Kadapa district is vanishing

  • కొత్త జిల్లాల ఏర్పాటుకు వెలువడిన నోటిఫికేషన్
  • రెండు జిల్లాలుగా విడిపోతున్న కడప
  • ఒకటి అన్నమయ్య జిల్లా.. రెండోది వైయస్సార్ జిల్లా

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా జిల్లాల ఏర్పాటు పైనే చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలను విభజించిన విధానంపై మామూలుగానే కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాలు, తమ ప్రాంతాలను ఇతర జిల్లాల్లో కలపబోతుండటం వంటి వాటిపై కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప పూర్తిగా కనుమరుగు కాబోతోంది. ఈ జిల్లాను రెండు ముక్కలు చేయబోతున్నారు. అన్నమయ్య జిల్లా పేరుతో రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. రెండో జిల్లాకు వైయస్సార్ జిల్లాగా నామకరణం చేయనున్నారు.

ఇక మొన్నటి వరకు కడపగా, ప్రస్తుతం వైయస్సార్ కడపగా ఈ జిల్లా ఉంది. కొత్త జిల్లాలు వస్తే... కడప అనే పేరు పూర్తిగా ఉనికిని కోల్పోనుంది. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప అంటే తిరుమలకు తొలి గడపగా శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు భావిస్తుంటారు. అలాంటి కడప కనుమరుగు కానుండటం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Kadapa District
New Districts
  • Loading...

More Telugu News